Effect of Etv -Eenadu Story | KTR Comes to Rescue of Orphan Kids | Bhadradri kothagudem Dist

తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులపై ఈనాడులో వచ్చిన కథనానికి మంత్రి KTR స్పందించారు. KTR సూచన మేరకు చిన్నారుల ఇంటికి వెళ్లిన MLA హరిప్రియ నాయక్ ………… వారిచదువు భవిష్యత్ బాధ్యత తీసుకోవడం సహా పక్కా ఇళ్లు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకి చెందిన…………. గణేశ్ , స్రవంతి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఫోటోగ్రాఫరుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న గణేశ్ … 2018లో గొంతు క్యాన్సర్ తో చనిపోవడంతో కుటుంబ భారం అంతా స్రవంతిపై పడింది. ఆ తర్వాత స్రవంతి కిడ్నీ సమస్యతో అనారోగ్యానికి గురై చనిపోయింది. తల్లిదండ్రుల మృతితో వారి ఇద్దరు చిన్నారుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఆ ఇద్దరు చిన్నారులు……. వృద్ధులైన అమ్మమ్మ తాతయ్య సంరక్షణలో ఉన్నారు. ఈనాడులో వచ్చిన కథనాన్ని చూసిన స్థానికులు ట్విట్టర్ ద్వారా మంత్రి KTR దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి చిన్నారులను ఆదుకోవాలని MLA హరిప్రియ నాయక్, కలెక్టర్ కు సూచించారు. మంత్రి ఆదేశంతో చిన్నారుల ఇంటికి వెళ్ళిన MLA చిన్నారులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

#LatestNews
#Etv Telangana

Leave a Comment